Tuesday, 21 September 2021

Nee Kougililo Taladaachi - Karthika Deepam Movie Song Lyrics

Movie : Karthika Deepam 
Music : Chellapilla Satyam 
Lyrics : Mylavarapu Gopi
Singers : S. Janaki & S. P. Balasubrahmanyam 

నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి

చల్లగ తాకే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై మనసే దివ్వెగా వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి

నింగి సాక్షి నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడ లోన నాలో నీవే సగపాలు
వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందాము
నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి

No comments:

Post a Comment